సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గాల్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి గారి నాయకత్వములో నడుస్తున్న PRTU తెలంగాణ కుటుంబ సభ్యులకు మరియు రాష్ట్ర ఉపాధ్యాయ లోకానికి వినమ్ర నమస్సులతో...
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయమది. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలా లేదా అనే మీమాంసలో ఉపాధ్యాయ సంఘాలు ఉన్న తరుణమది. ఉద్యమంలో చేరితే లాభమా? నష్టమా? మెజారిటీ వ్యక్తులు లెక్కలు వేసుకుంటూ ఆచి తూచి అడుగులు వేయాలని, భవిష్యత్తును పదిల పరచుకొని ఉండాలని ఊగిసలాడుతున్న సంధికాల సమయంలో, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కూడ అంతే ముఖ్యమని భావించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తాను సైతం ప్రధాన భూమికను పోషించాలనే శ్రీ గాల్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి గారి మస్తిష్క తపన నుండి తట్టుకొని వచ్చిన ఆలోచనల పరంపర ఫలితమే PRTU తెలంగాణ ఆవిర్భావానికి నాంది పలికింది. ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గోని పోరాడటానికి ఒక వేదిక కావాలనే ప్రగాఢ ఆకాంక్ష రూపమే PRTU తెలంగాణ వ్యవస్థాపనకు ఆజ్యం పోసింది. ఆలస్యం చేయకుండా అప్పటి ప్రధాన ఉపాధ్యాయ సంఘం నుండి వేరుపడి శ్రీ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మరియు వారి మిత్ర బృందం కలిసి రిజిస్ట్రేషన్ సంఖ్య 711/2011 ద్వార శ్రీ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులుగా కార్యవర్గం ఏర్పడి ఆనాటి నుండి నేటి వరకు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అహర్నిశలు కృషి చేస్తూనే ఉంది. వేదిక ఏదైన ఆధిపత్యం పోరు, వెన్నుపోటు తత్వం, నమ్మకద్రోహం, విశ్వాస ఘాతుకం ఉంటాయనేది కాదనలేని సత్యం. అందులో PRTU తెలంగాణ కూడ అతీతమేమి కాదు. ఎన్ని ఆటు పొట్లు ఎదురైన మొక్కవోని ధైర్యంతో, మనసున్న మంచి మనుష్యుల బృందంగా ఏర్పడి నేటి వరకు సంఘాన్ని ఈ స్థాయిలో ఉండటానికి, వ్యక్తిగత జీవితాన్ని ఫణంగా పెట్టి, ఆర్ధిక ఒడి దుడుకులను అధిగమించి అన్ని తానై సంఘాన్ని ముందుకు నడుపుతున్న సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ గాల్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ లోకం సర్వదా రుణపడి ఉంటుందని ప్రకటించటడంలో సందేహం లేదు, అతిశయోక్తి కాదు.
శాసన మండలి సభ్యులుగా పోటీ చేయటానికి ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేసి, అవకాశం అంది రానందున కాంగ్రెస్ పార్టీలో చేరి, అటు రాజకీయ నాయకులుగా ప్రజల కోసం, వ్యవస్థాపక అధ్యక్షులుగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వేళ, తాను నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, అన్ని వర్గాల ప్రజల, ఉపాధ్యాయ మరియు ఉద్యోగుల సమస్యల స్వరూపాన్ని జీర్ణించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి రాజకీయ దురంధరుడు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి నాయకత్వములో బ్రహ్మాండమైన మెజారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడటం వల్ల సహజంగానే ఉపాధ్యాయుల్లో ఆశించిన తృప్త సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఉపాధ్యాయ లోకానికి మరీ ముఖ్యంగా PRTU తెలంగాణకు వారధిగా ఉంటూ, దశల వారిగా ప్రాధాన్యత క్రమంలో సమస్యలు ఒక్కొక్కటిగా పరష్కరిస్తూ శ్రీ గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు అందరివాడుగా ఉపాధ్యాయ మరియు ఉద్యోగ లోకం ఆదరాభిమానాలకు పాత్రులవుతారనే సుధృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాము. అదే రీతిలో మనం కూడ వ్యక్తిగతంగా, రాజకీయంగా మరియు వ్యవస్థ పరంగా శ్రీ గాల్ రెడ్డి హర్ష వర్ధన్ రెడ్డి గారికి సంపూర్ణ సహకారం అందించి ఆతని పటిష్టమైన నాయకత్వం బలపడటానికి కదం కదం కలిపి, ఐక్యతతో ముందుకు సాగుదామని ఆశిస్తూ... ఆకాంక్షిస్తూ.....
ఉపాధ్యాయుల సంక్షేమానికి పెద్దపీట వేయటానికి నిస్సంకోచంగా, నిస్సందేహంగా ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ, దృఢమైన సంఘ నిర్మాణానికి అన్ని వేళల్లో సహకరించాలని ప్రతీ ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ www.prtutelangana.org వెబ్ సైట్ ను ఉపాధ్యాయుల ఎన్సైక్లోపీడియా లాగా వినియోగించుకుంటారని అభిలాషిస్తూ.....
సదా సంఘ సేవలో
గార్లపాటి ఉమాకర్ రెడ్డి
రాష్ట్ర అధ్యక్షులు
డా. పర్వతి సత్యనారాయణ
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
Mobility Solutions
Job Support
Our Gallery
Contact Us
Flat No: 502, Kailash block, Saket Sriyam Complex, Kapra, ECIL post, Secundrabad-5000 62,Telangana.
8801384093. slstechservices@gmail.com